తూర్పుగోదావరిలో పెద్ద పులి సంచారం..
7tv focus : జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. దేవరపల్లి మండలం గౌరీపట్నంలోని మేరీ మాత ఆలయం వెనుక ఉన్న కొండ ప్రాంతంలో పెద్ద పులి తిష్ట వేసినట్లు స్థానికులు గుర్తించారు. ఆలయం వెనుక ఉన్న కొండతో పాటు సమీపంలోని క్వారీ ప్రాంతంలోనూ పులి సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. రెండు రోజులుగా పులి కదలికలు కనిపిస్తున్నప్పటికీ అది పట్టుబడకపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పులి సంచారంపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పరిసర ప్రాంతాల్లో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పులి ఏ ప్రాంతంలో సంచరిస్తుందనే విషయాన్ని గుర్తించేందుకు కదలికలను పరిశీలిస్తున్నారు.పులి సంచారం నేపథ్యంలో అధికారులు కీలక సూచనలు జారీ చేశారు. క్వారీ ప్రాంతంలోకి కార్మికులు వెళ్లవద్దని.....
⏱ Top Story
👁 12 Views |
⬇️ 0 Downloads