తెలంగాణకు రూ.7,597 కోట్ల రహదారుల వరం
ఆర్మూర్-మంచిర్యాల, జగిత్యాల-కరీంనగర్ నాలుగు వరుసల జాతీయ రహదారులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం మోదీకి తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపిన కిషన్ రెడ్డి 7టీవీ ఫోకస్, న్యూఢిల్లీ, జూన్ 4:తెలంగాణలో రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ ఊతమిచ్చింది. రాష్ట్ర ఉత్తర జిల్లాల రవాణా వ్యవస్థను మరింత ఆధునికంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూ.7,597.16 కోట్ల వ్యయంతో 190.76 కిలోమీటర్ల జాతీయ రహదారుల విస్తరణ ప్రాజెక్టుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఏ ఈ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆర్మూర్-జగిత్యాల-మంచిర్యాల (ఎన్‌హెచ్-63), జగిత్యాల-కరీంనగర్ (ఎన్‌హెచ్-563) మార్గాలను నాలుగు వరుసల రహదారులుగా అభివృద్ధి చేయనున్నారు.ఈ నిర్ణయాన్ని స్వాగతించిన కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి,...
⏱ Top Story
👁 8 Views |
⬇️ 0 Downloads