తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన కరవు మండలాల జాబితాపై బండి సంజయ్ విమర్శలు
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన కరవు మండలాల జాబితాపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ జాబితా అత్యంత అశాస్త్రీయంగా, పక్షపాత ధోరణితో ఉందని ఆయన ఆరోపించారు. కేవలం మొక్కుబడిగా ఈ జాబితాను తయారు చేశారని మండిపడ్డారు. ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని బండి సంజయ్ అన్నారు. 35 శాతం వర్షపాతం లోటు ఉన్న మండలాలను కూడా జాబితాలో చేర్చకపోవడం ప్రభుత్వ ఉద్దేశాన్ని స్పష్టం చేస్తోందన్నారు. హుస్నాబాద్, వేములవాడ, సిరిసిల్ల, మానకొండూరు, చొప్పదండి, హుజూరాబాద్ నియోజకవర్గాల్లోని తీవ్ర కరవు పరిస్థితులు ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. పంట పొలాలు బీళ్లుగా మారినా, ప్రజలు తాగునీటి ఎద్దడితో...
⏱ Top Story
👁 9 Views |
⬇️ 0 Downloads