దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించాలి
7టీవీ ఫోకస్, న్యూఢిల్లీ, జూన్ 10: దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించేందుకు 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి పార్లమెంట్‌లో చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్ నేత, మాజీ కార్పొరేషన్ చైర్మన్ మేడె రాజీవ్ సాగర్ డిమాండ్ చేశారు. దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు వర్తించకపోవడం వల్ల సామాజిక, ఆర్థికంగా తీవ్ర అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు.దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా అంశంపై ఢిల్లీలో జస్టిస్ కె.జి. బాలకృష్ణన్ నేతృత్వంలోని జాతీయ విచారణ కమిషన్‌ను బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం మంగళవారం కలిసి వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా మేడె రాజీవ్ సాగర్ మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పడిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను సమానంగా గుర్తించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads