Engineering-Student_V_jpg--816x480-4g
7TV Focus News

 దసరా సెలవులని వచ్చాడు.. ఇంట్లో కుప్పకూలిపోయిన విద్యార్థి

7tv focus : దసరా సెలవులు కావడంతో స్వస్థలానికి వచ్చిన ఇంజినీరింగ్‌ విద్యార్థి తల్లిదండ్రుల ముందే విగతజీవిగా మారిపోయాడు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధి గండగలపాడులో గుండెపోటుతో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. పదో వార్డు కౌన్సిలర్ కిన్నెర కృష్ణ, విజయ దంపతులకు కుమార్తె కీర్తి, కుమారుడు రాఘవ ఉన్నాడు. హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న రాఘవ దసరా పండగ సెలవులు కావడంతో రెండ్రోజుల క్రితమే ఇంటికొచ్చాడు.ఇవాళ ఉదయం దుస్తులు అమ్మే వ్యక్తి బైకుపై వీరి ఇంటి వద్దకు వచ్చాడు. రాఘవ తల్లి ఆ దుస్తులు కొనేందుకు వాటిని చూస్తుండగా.. నాన్నా.. నీకు ఈ చొక్కాలు బాగుంటాయి అంటూ రాఘవ మంచంపై కూర్చుంటూనే కింద పడిపోయాడు. దీంతో...
⏱ Top Story 👁 6 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article