దేశం వదిలివెళ్లాలన్న నోటీసుపై బాంబే హైకోర్టుకు ఇమ్రాన్
7tv focus : దేశం వదిలివెళ్లాలని తనకు జారీ చేసిన నోటీసును నటుడు, ఆమిర్ ఖాన్ అల్లుడు ఇమ్రాన్ ఖాన్.. బాంబే హైకోర్టులో సవాలు చేయనున్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో అవకతవకల నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు, సీజేపీ నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఇమ్రాన్ పాల్గొన్నారు. ముంబైలోని క్రాంతి మైదాన్‌లో జరిగిన ప్రదర్శనకు ఆయన సంఘీభావం తెలిపారు. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఈనెల 28 లోపు దేశం విడిచివెళ్లాలని అధికారులు ఆయనకు నోటీసు పంపారు. ఖాన్ అమెరికా జాతీయుడని, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డు ఉన్నవారు దేశంలో ఎలాంటి నిరసన ప్రదర్శనలో పాల్గొనరాదని,...
⏱ Top Story
👁 10 Views |
⬇️ 0 Downloads