ద్విశతకం చేజార్చుకున్న పడిక్కల్..
7tv focus : గాలే టెస్టులో ఖతర్నాక్ ఇన్నింగ్స్ ఆడిన దేవ్‌దత్ పడిక్కల్(167) ద్విశతకం చేజార్చుకున్నాడు. రెండో రోజు కూడా శ్రీలంక బౌలర్లను విసిగించిన ఈ లెఫ్ట్ హ్యాండర్‌ను ఎట్టకేలకు ప్రభాత్ జయసూర్య(2-92) వెనక్కి పంపాడు. టెస్టుల్లో తొలి శతకాన్నే డబుల్ సెంచరీగా మలచాలనుకున్న అతడు ఔటవ్వడంతో ఐదో వికెట్ కోల్పోయింది టీమిండియా. ప్రస్తుతం ధ్రువ్ జురెల్(19 నాటౌట్), రవీంద్ర జడేజా(1 నాటౌట్)లు ఆడుతున్నారు.సుదీర్ఘ ఫార్మాట్‌లో ఛతేశ్వర్ పూజారా అనంతరం మూడో స్థానంలో నేను సరిపోతాను అని శతకంతో చాటిన దేవ్‌దత్ పడిక్కల్(167 : 230 బంతుల్లో 15 ఫోర్లు, సిక్సర్) ఔటయ్యాడు. మొట్టమొదటి సెంచరీతో భారత జట్టు భారీ స్కోర్‌కు బాటలు వేసిన ఈ కుర్రాడు రెండో రోజు లంచ్ తర్వాత వెనుదిరిగాడు....
⏱ Top Story
👁 7 Views |
⬇️ 0 Downloads