ponguleti1-78361789221466
7TV Focus News

ధరణిలో 23 వేల ఎకరాల అక్రమాలు..

తెలంగాణ 7tv focus : తెలంగాణలోని దాదాపు 2.49 కోట్ల ఎకరాల భూమిని తమ సొంత ఆస్తిగా భావించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన సాగించిందని మంత్రి పొంగులేటి మండిపడ్డారు. ధరణి పోర్టల్ నిర్వహణను దివాలా తీసిన ఒక విదేశీ కంపెనీకి అప్పగించారని దుయ్యబట్టారు. ధరణి పోర్టల్‌ పై ఉన్న నియంత్రణను దుర్వినియోగం చేస్తూ అర్ధరాత్రి సమయాల్లో రిజిస్ట్రేషన్లు చేశారని కీలక ఆరోపణలు చేశారు. ప్రజల ఆస్తులను పరిరక్షించడమే రెవెన్యూ సంస్కరణల ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. శాసనసభలో 22ఏ నిషేధిత భూముల అంశంపై జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.తమ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టం ఆశామాషీగా తీసుకురాలేదని.. దాదాపు 18 రాష్ట్రాల్లోని అధికారులు అధ్యయనం చేశాక..ప్రజల నుంచి...
⏱ Top Story 👁 102 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article