cr-20261028_24cf2fade844dda9
7TV Focus News

ధరల భారం నుంచి ఊరట.. తెలంగాణలో ఇక బియ్యంతో పాటు నిత్యావసరాలు!

తెలంగాణలో పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, ఎల్ నినో ప్రభావంతో కరవు పరిస్థితులు తలెత్తవచ్చన్న ఆందోళనల నేపథ్యంలో పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం రేషన్ కార్డులపై పంపిణీ చేస్తున్న సన్నబియ్యంతో పాటు కందిపప్పు, గోధుమపిండి, పామాయిల్, చక్కెర, చింతపండు, కారంపొడి వంటి మరిన్ని సరుకులను అందించే ప్రతిపాదనను తీవ్రంగా పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదన సాధ్యాసాధ్యాలపై సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల అవసరాలు, సరుకుల సేకరణకు ఏర్పాట్లు, ఎంత పరిమాణంలో ఇవ్వాలి? ఎంతకాలం కొనసాగించాలి? బడ్జెట్‌పై పడే భారం వంటి అంశాలను అంచనా వేయాలని సూచించారు. ఆర్థిక, లాజిస్టిక్స్ పరమైన...
⏱ Top Story 👁 18 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article