farmer-accident_V_jpg--816x480-4g
7TV Focus News

ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి

7tv focus : ధాన్యం విక్రయించుకునేందుకు పొలానికి వెళ్తున్న రైతును గుర్తుతెలియని కారు ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన మెదక్‌ జిల్లాలో చోటుచేసుకుంది. హవేలి ఘనపూర్‌ మండలం ఔరంగాబాద్‌కు చెందిన తిరుపతి కిషన్‌ (65) ఈ ప్రమాదంలో మృతిచెందారు. గ్రామ పరిసరాల్లో ప్రభుత్వ ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం లేకపోవడంతో ప్రైవేటు వ్యాపారుల ద్వారా ధాన్యం అమ్ముకునేందుకు సిద్ధమైన ఆయన.. చివరకు రోడ్డు ప్రమాదానికి బలయ్యారు.తిరుపతి కిషన్‌ తన పొలంలో వరి కోతలు పూర్తి చేసి ధాన్యాన్ని విక్రయించేందుకు సిద్ధం చేసుకున్నారు. అయితే గ్రామ పరిసరాల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రం అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు వ్యాపారులు, దళారులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో నవంబర్‌ 3న రాత్రి 10.45 గంటల...
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article