road_accident_kadap_4c11f05826_V_jpg--625x351-4g
7TV Focus News

నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. 

 7tv focus : దేవరకొండ మండలం అంబటోనిగూడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని బాధితులను దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద తీరును పరిశీలించి మృతిచెందిన వారి వివరాలను ఆరా తీశారు.ఈ మేరకు మృతులను నేరడుగొమ్ము మండలం పెద్దమునగల్ గ్రామానికి చెందిన అంజయ్య, చందంపేట మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన కోటేశ్‌గా గుర్తించారు.
⏱ Top Story 👁 9 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article