nagole-murder-case_V_jpg--816x480-3g
7TV Focus News

నాగోల్‌ హత్య కేసులో నిందితుడు మంత్రి తుమ్మల అనుచరుడే..!

  హైదరాబాద్‌ 7tv focus : హైదరాబాద్‌ నాగోల్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జేకే మహేష్‌ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడే అని తేలింది. ఏ మాత్రం భయం లేకుండా ‘ప్రభుత్వ వాహనం’ అని బోర్డు ఉన్న కారులో వచ్చి హత్యకు పాల్పడటం చర్చనీయాంశంగా మారింది.నాగోల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బండ్లగూడ ఆనంద్‌నగర్‌ చౌరస్తా సమీపంలో సోమవారం రాత్రి రౌడీషీటర్‌ మహమ్మద్‌ నయీమ్‌ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ఇల్లెందుకు చెందిన రౌడీషీటర్‌ ఉమామహేశ్వర్‌ అలియాస్‌ జేకే మహేష్‌ను ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. మహేష్‌తో పాటు మరో ఐదుగురు ఈ హత్యలో పాల్గొన్నట్లు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పోలీసులు గుర్తించారు.
⏱ Top Story 👁 9 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article