నిద్రపోతున్న మహిళను నోట కరిచి లాక్కెళ్లిన పులి!
ఇంటర్నెట్ డెస్క్: పులి దాడిలో ఓ మహిళ కన్నుమూసిన ఘటన మధ్యప్రదేశ్లో తాజాగా వెలుగు చూసింది. ఇంట్లో నిద్రపోతున్న మహిళను పులి ఈడ్చుకెళ్లడంతో తీవ్రగాయాల పాలైన ఆమె కన్నుమూసింది. కన్హా నేషనల్ పార్కు సమీపంలో పారాపూర్ బాగాటొలా గ్రామంలో ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం, అర్ధరాత్రి 1.30 సమయంలో సుగ్నీ బాయి దుర్వే తన ఇంట్లో నిద్రపోతున్న సమయంలో పులి వచ్చింది. మహిళ తలను నోట పట్టింది. ఆ తరువాత ఆమెను ఏకంగా 300 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. మహిళ హాహాకారాలు విన్న గ్రామస్థులు బయటకు వచ్చారు. ఈ క్రమంలో పులి మహిళను విడిచిపెట్టి అడవిలోకి పారిపోయింది. తలకు తీవ్ర గాయాలైన మహిళను బైహార్లోని ఆసుపత్రికి తీసుకెళ్లగా...
⏱ Top Story
👁 13 Views |
⬇️ 0 Downloads