girls-hair-cutting_V_jpg--816x480-4g
7TV Focus News

నిద్రిస్తున్న 10 మంది విద్యార్థినుల జడలు కత్తిరించిన ఆకతాయిలు!

7tv focus : పల్నాడు జిల్లాలోని ఓ బాలికల గురుకుల పాఠశాలలో చోటుచేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఎనిమిదో తరగతి విద్యార్థినుల జడలను దుండగులు కత్తిరించారు. గురుకులంలోని మొత్తం10 మంది బాలికల జుట్టు కత్తిరించినట్లు సమాచారం. ఈ ఘటన బయటకు రావడంతో పాఠశాలలో ఆందోళన నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. పల్నాడు జిల్లా సత్తెనపల్లి రూరల్‌ మండలం రామకృష్ణాపురంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్‌ బాలికల గురుకుల పాఠశాలలో ఈ ఘటన జరిగింది. పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న 10 మంది విద్యార్థినులు రాత్రి నిద్రిస్తున్న సమయంలో వారి జడలను ఎవరో కత్తిరించారు. ఉదయం నిద్రలేచిన తర్వాత జుట్టు కత్తిరించి ఉండటాన్ని గమనించిన బాలికలు భయాందోళనకు గురయ్యారు. ఈ...
⏱ Top Story 👁 10 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article