నిరుద్యోగ యువతకు నాణ్యమైన స్టడీ మెటీరియల్ ఎంతో అవసరం
7tv focus : వివిధ ప్రభుత్వ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు అండగా నిలిచే లక్ష్యంతో రూపొందించిన కరెంట్ అఫైర్స్ స్టడీ మెటీరియల్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో నిరంతరం శ్రమిస్తున్న నిరుద్యోగ యువతకు నాణ్యమైన స్టడీ మెటీరియల్ అందించడం ఎంతో అవసరమన్నారు. పోటీ పరీక్షల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఈ కరెంట్ అఫైర్స్ మెటీరియల్ విద్యార్థుల ప్రిపరేషన్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
⏱ Top Story
👁 9 Views |
⬇️ 0 Downloads