tragedy_V_jpg--816x480-3g
7TV Focus News

 నీటి తొట్టిలో పడి ఆరేళ్ల బాలుడు మృతి

7tv focus : జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్‌ మండల కేంద్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వడ్డెర కాలనీలో పశువులకు నీళ్లు తాగించేందుకు ఏర్పాటు చేసిన తొట్టిలో పడి ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.వడ్డెర కాలనీకి చెందిన సూర లావణ్య, అంజయ్య దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. లావణ్య రోజువారీ కూలీ పనుల నిమిత్తం ఉదయం వాల్గొండ గ్రామానికి వెళ్లింది. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇద్దరు పిల్లలు మాత్రమే కనిపించారు. ఆరేళ్ల చిన్నారి సూర బన్నీ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.వెంటనే బాలుడి కోసం పరిసర ప్రాంతాల్లో వెతకగా.. పశువులకు నీళ్లు తాగించేందుకు ఏర్పాటు చేసిన తొట్టిలో పడి మృతి చెందినట్లు...
⏱ Top Story 👁 9 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article