nookaraju_054052baf8_V_jpg--625x351-4g
7TV Focus News

నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు.. 

కాకినాడ 7tv focus : ఏపీలో పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటన సంచలనం రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు ముందు రోజు అసలు ఏం జరిగిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రధాన నిందితుడు సాధిక్‌ ఖాన్‌కు నూకరాజు కుటుంబానికి మధ్య జరిగిన గొడవలు కాస్తా ఎందుకు ఆత్మహత్య వరకు వెళ్లాయనే దానిపై కీలక వివరాలను రాబట్టారు. సౌజన్యను లోబర్చుకుని మరోపక్క ఆమెకు తెలియకుండానే ఈనెల 14న రహస్య వివాహానికి సాధిక్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన సౌజన్య.. సాధిక్‌ను నిలదీయగా ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం.
⏱ Top Story 👁 7 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article