‘నేను సైతం’ సీసీ కెమెరాలపై సీపీ సమీక్ష
రీ-వెరిఫికేషన్ వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు 7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 19: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన ‘నేను సైతం’ సీసీటీవీ కెమెరాల పనితీరు, నిర్వహణ, జియో ట్యాగింగ్, రీ-వెరిఫికేషన్ ప్రక్రియపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ సమీక్ష నిర్వహించారు. సీపీ కార్యాలయంలోని ప్రధాన కాన్ఫరెన్స్ హాల్లో డీసీపీ స్పెషల్ బ్రాంచ్ సుధీంద్రతో కలిసి అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలు, ఎస్ఐలతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనరేట్ పరిధిలో మొత్తం 1,37,042 ‘నేను సైతం’ సీసీటీవీ కెమెరాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో శేరిలింగంపల్లి జోన్లో 42,475, కూకట్పల్లి జోన్లో 53,424, కుత్బుల్లాపూర్ జోన్లో 41,143 సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని తెలిపారు....
⏱ Top Story
👁 69 Views |
⬇️ 2 Downloads