city6_875a772c3d_V_jpg--625x351-4g
7TV Focus News

నేలకూలుతున్న చరిత్ర

హైదరాబాద్‌ 7tv focus : వర్షాకాలం వచ్చిందంటే నగరంలో ముంపు భయంతో వణికేవాళ్లు కొందరైతే.! శిథిలావస్థలోని వారసత్వ కట్టడాలు కనుమరుగవుతాయేమోనని బాధపడేవాళ్లు మరికొందరు. వానాకాలంలో ప్రతియేటా ఒక్కొక్క చారిత్రక జ్ఞాపకం నేలమట్టమవుతున్నది. గడిచిన పదేళ్లలో అత్యంత అరుదైన ఐదు వారసత్వ కట్టడాలను నగరవాసులు కోల్పోయారు. ప్రజాప్రయోజనంలోకి తీసుకురావాలని.. హైదరాబాద్‌ నగరాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోని వారసత్వ పరిరక్షణ కమిటీ గుర్తించిన 142 చారిత్రక కట్టడాల్లో ఇదీ ఒకటి. ఇన్‌ట్యాక్‌ సంస్థ ప్రతినిధులు 2013లో మహబూబ్‌ మాన్షన్‌ను తనిఖీ చేశారు. ఆ భవనాన్ని ప్రజాప్రయోజనంలోకి తీసుకువచ్చేందుకు, అక్కడ ఆహారశాలలు, పురావస్తు వస్తువుల ప్రదర్శనశాల, నగర సంస్కృతిని తెలిపే వస్తువుల విక్రయశాలలు ఏర్పాటు చేస్తే, అదొక పర్యాటక స్థలంగా విరాజిల్లుతుందని ఆర్కిటెక్టు విద్యార్థులు సూచించారు. అయినా, ప్రభుత్వాలు పట్టించుకోలేదు....
⏱ Top Story 👁 9 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article