Gellu-Srinivas_V_jpg--816x480-4g
7TV Focus News

నోవా మెడికల్‌ కాలేజీ గుర్తింపు రద్దు చేయాలి..

7tv focus : నిబంధనలకు అనుగుణంగా మౌలిక వసతులు లేనప్పటికీ నోవా మెడికల్‌ కాలేజీకి ఇచ్చిన గుర్తింపును రద్దు చేయాలని బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ డిమాండ్‌ చేశారు. జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ), రాష్ట్ర వైద్యశాఖ, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ అధికారుల తీరుపై విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు, మీడియా ప్రతినిధులు నోవా మెడికల్‌ కాలేజీని సందర్శించారు. కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్న సమయంలో పోలీసులు జోక్యం చేసుకుని వారిని అదుపులోకి తీసుకుని అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం అవసరమైన వసతులు లేకున్నా కాలేజీకి గుర్తింపు ఎలా ఇచ్చారో రాష్ట్ర ప్రభుత్వం విచారణ...
⏱ Top Story 👁 10 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article