cjp-protest-2_V_jpg--816x480-4g
7TV Focus News

న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు

7tv focus : దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆందోళనకర వాతావరణం కొనసాగుతోంది. సీజేపీ, ఎస్‌ఎఫ్‌ఐ సహా పలు సంఘాల నేతలు ఈసీకి వ్యతిరేకంగా ఆందోళనకు సిద్ధమవ్వగా.. వారిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారులతోపాటు పలువురు జర్నలిస్టుల్ని కూడా పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. వీరిలో అనేక మంది మహిళలు కూడా ఉన్నారు.ప్రముఖ జాతీయ దినపత్రికలకు చెందిన జర్నలిస్టులు, డిజిటల్ జర్నలిస్టులు, కెమెరా పర్సన్స్ సహా మీడియాలో పని చేసే అనేక మందిని రైజైనా రోడ్‌లోని ప్రెస్ క్లబ్ బయట పోలీసులు అరెస్టు చేశారు. ప్రెస్ క్లబ్ బయట దాదాపు 70 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారుల్ని కన్నాట్ ప్లేస్ నుంచి బస్సులో తరలిస్తుండగా.. వారిలో ఇద్దరు జర్నలిస్టులు, ఇద్దరు ఆందోళనకారులకు గాయాలయ్యాయి....
⏱ Top Story 👁 12 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article