పత్తికి పెరిగిన మద్దతు ధర
జమ్మికుంట 7tv focus : పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. 2026-27 మార్కెటింగ్ సీజన్‌కు పత్తి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.8,667గా నిర్ణయించింది. గత సీజన్‌లో రూ.8, 110గా ఉన్న మద్దతు ధరను ఈసారి రూ.557 పెంచింది. దీంతో పత్తి సాగు చేస్తున్న రైతుల్లో కొంతమేర హర్షం వ్యక్తమవుతోంది. గతేడాది 4.15లక్షల క్వింటాళ్ల క్రయవిక్రయాలు జరగ్గా, సీసీఐ 1.49లక్షల క్వింటాళ్ల పత్తిని మద్దతు ధర ప్రకారం సేకరించింది. మిగితా 2.69లక్షల పత్తిని ప్రైవేట్ వ్యాపారులు కొనుగోళ్లు చేపట్టారు.అయితే పెంచిన మద్దతు ధర తమకు దక్కాలంటే మొత్తం పంటను సీసీఐ కొనుగోలు చేయా లని రైతులు కోరుతున్నారు. పత్తి సాగులో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు ఏటా పెరుగుతున్నాయి. దీనికితోడు వాతావరణ...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads