పలు పంచాయతీల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ
7tv focus : బూర్గంపహాడ్ మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం, కృష్ణసాగర్ పంచాయతీల్లో మంగళవారం లబ్దిదారులకు ఆయా సర్పంచుల ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న రేషన్ స్మార్ట్ కార్డులను లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని ప్రజాప్రతినిధులు సూచించారు. నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో సర్పంచ్ బానోతు సరోజతో కలిసి తాసీల్దార్ కేఆర్కే ప్రసాద్ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అప్పిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జీపీవో బుల్లారావు, కృష్ణసాగర్ సర్పంచ్ తాటి వాణి, ఉప సర్పంచ్ భూక్యా మోహనరావు, కార్యదర్శి నాగిరెడ్డి, సేల్స్ మెన్ ధరావత్ రాంబాబు, పాలకవర్గాల సభ్యులు పాల్గొన్నారు.
⏱ Top Story
👁 11 Views |
⬇️ 0 Downloads