పలు వాహనాలను ఢీకొట్టిన 18 చక్రాల ట్రైలర్.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
7tv focus : ఒక జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న 18 చక్రాల ట్రైలర్ అదుపుతప్పింది. పలు వాహనాలను ఢీకొట్టడంతో పాటు పాదచారులపైకి అది దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం జైపూర్-ఢిల్లీ హైవేపై 18 చక్రాల ట్రైలర్ లారీ వేగంగా దూసుకెళ్లింది. దౌలత్‌పురా టోల్ ప్లాజా నుంచి అజ్మీర్ రోడ్డు వైపు వెళ్తున్న ఈ భారీ ట్రైలర్, ఫ్లైఓవర్ మీదుగా సర్వీస్ లేన్ వైపు దిగుతున్నప్పుడు అదుపుతప్పింది. జైపూర్‌లోని అనాజ్ మండి వెనుక గేటు వైపు రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్‌ను బలంగా ఢీకొట్టింది. పలు వాహనాలను ఢీకొట్టడంతో పాటు...
⏱ Top Story
👁 6 Views |
⬇️ 0 Downloads