పల్సి గ్రామ శివారులో చిరుత సంచారం..
7tv focus : నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పల్సి గ్రామంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన థౌటి రాములు తన వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం అడవి జంతువు అడుగుల గుర్తులను గుర్తించాడు. పులి కావొచ్చని అతడికి అనుమానం రావడంతో వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాడు. అటవీ శాఖ అధికారి శివప్రసాద్ తమ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని వ్యవసాయ క్షేత్రంలో కనిపించిన అడుగులను పరిశీలించారు. వాటి ఆకారం, పరిమాణంను పరిశీలించిన అనంతరం అవి చిరుత పులి అడుగులేనని నిర్ధారించారు.చిరుత పులి సంచారం విషయం తెలియడంతో పల్సి గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల రైతులు, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు...
⏱ Top Story
👁 11 Views |
⬇️ 0 Downloads