పులివెందులలో ఉద్రిక్తత.. టీడీపీ నేత కారుకు నిప్పు..!
7tv focus : ఏపీలోని కడప జిల్లాలో గత అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పులివెందుల నియోజకవర్గంలోని ఇడుపులపాయకు చెందిన టీడీపీ నాయకుడు పీపీ చెన్నరాయుడు ప్రయాణిస్తున్న ఎస్‌యూవీ వాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించి దహనం చేశారు. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి చెన్నరాయుడు తన వాహనంలో వేంపల్లె మండలంలోని గండిరోడ్డు మీదుగా వెళుతుండగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆయన కారును అడ్డగించారు. ఆ తర్వాత చెన్నరాయుడు చూస్తుండగానే కారుకు నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందిన వెంటనే డీఎస్పీ మురళీ నాయక్ నేతృత్వంలోని పోలీస్ బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. అగ్నిమాపక సిబ్బందిని...
⏱ Top Story
👁 7 Views |
⬇️ 0 Downloads