పులివెందులలో కార్లు, బైక్‌లకు నిప్పు పెట్టిన దుండగులు..
7tv focus : వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలోదుండగులు పలు వాహనాలకు నిప్పుపెట్టడంతో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌కు ముందు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలోని శిల్పారామం సమీపంలోని ఉల్లిమలకు చెందిన మధుసూదన్‌రెడ్డికి చెందిన తోట వద్ద శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు పెట్రోల్ పోసి పెద్ద ఎత్తున వాహనాలకు నిప్పంటించారు.ఇందులో 3 కార్లు, 10 బైక్‌లు, ట్రాక్టర్‌కు నిప్పు పెట్టడంతో మంటల్లో వాహనాలు పూర్తిగా దగ్దమయ్యాయి. ఘటన. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
⏱ Top Story
👁 2 Views |
⬇️ 0 Downloads