పెనగలూరులో పెట్రోల్ బాంబుల దాడి ప్రచారం అవాస్తవం
7tv focus : జిల్లా వ్యాప్తంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. చిన్న చిన్న సంఘటనలు మినహా ఎక్కడా పెద్దగా ఇష్యూస్ ఏమీ లేవన్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలంలో ఉదయం పెట్రోల్ బాంబులతో దాడి జరిగిందంటూ కొన్ని వార్తలు, ప్రచారాలు వచ్చాయని.. అయితే అది పూర్తిగా అవాస్తవమన్నారు. వాస్తవానికి ఆ ఘటన ఉదయం 6 గంటల కంటే ముందే ఇద్దరి మధ్య జరిగిన ఒక చిన్న పెనుగులాట వల్ల జరిగిందని చెప్పుకొచ్చారు.అక్కడ ఉన్న పోస్టర్లను అంటించడం వల్ల దాన్ని పెట్రోల్ బాంబులుగా ప్రచారం చేశారని వివరించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకున్నారన్నారు....
⏱ Top Story
👁 10 Views |
⬇️ 0 Downloads