పెళ్లి చేసుకున్న ఫుట్‌బాల్ స్టార్
లిస్బన్ 7tv focus : పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రోనాల్డోపెళ్లి చేసుకున్నాడు. పదేళ్లుగా కలిసి జీవిస్తున్న తన ప్రియురాలు జార్జియానా రోడ్రిగేజ్‌ను అతను మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ జోడీ ఇప్పుడు అధికారికంగా భార్యాభర్తలు అయ్యారు. రాజధాని లిస్బన్‌కు సమీపంలో ఉన్న కాస్‌కేయస్ అనే కోస్టల్ పట్టణంలో పెళ్లి వేడుక జరిగింది. ఈ మ్యారేజీకి అతని అయిదుగురు పిల్లలు కూడా హాజరయ్యారు. రింగులు మార్చుకున్న పిక్స్‌ను ఆ ఇద్దరూ తమ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లలో పోస్టు చేశారు.
⏱ Top Story
👁 10 Views |
⬇️ 1 Downloads