పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం.. వెడ్డింగ్ కార్డ్స్ పంచేందుకు వెళ్తుంటే..
7tv focus : కొన్ని రోజుల్లో పెళ్లి బాజాలు మోగనున్న ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. తన కొడుకు పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్లే క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ శివారు శామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.కీసర మండలం యాద్గారిపల్లి గ్రామానికి చెందిన పుట్ట శ్రీరాములు (48) తన కొడుకు పెళ్లి పత్రికలు పంచేందుకు పుట్ట చిత్తయ్య (65)తో కలిసి బైకుపై బయలు దేరాడు. అయితే ఈ క్రమంలో మూడు చింతలపల్లిలో నాగిశెట్టిపల్లి కోళ్ల ఫారాల సమీపంలో వీరిద్దరూ ప్రయాణిస్తున్న బైకును పారిశ్రామిక వ్యర్థాలను తరలించే లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీరాములు, చిత్తయ్య అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు...
⏱ Top Story
👁 8 Views |
⬇️ 0 Downloads