పేదల ఇళ్ల స్థలాల కోసం పోరాటం కొనసాగుతుంది: సీపీఐ
7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూలై 6: ఇందిరాపార్క్ వద్ద వామపక్షాల ధర్నాలో కుత్బుల్లాపూర్ నుంచి భారీగా పాల్గొన్న సీపీఐ శ్రేణులు – హామీలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ఇ ళ్ల స్థలాలు లేని ప్రతి పేద కుటుంబానికి స్థలం, ఇల్లు లభించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని సీపీఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ అన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు, అర్హులకు ఇంటి పట్టాల పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సోమవారం ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి సీపీఐ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమా మహేష్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇళ్ల స్థలాలు, గృహాల నిర్మాణం...
⏱ Top Story
👁 18 Views |
⬇️ 0 Downloads