7TV Focus News

 పేరు మార్చినంత సులువుగా హాస్పిటల్‌ కట్టిన చరిత్రను మార్చలేవు 

హైదరాబాద్‌ 7tv focus : ఆలోచన, ఆచరణ కేసీఆర్‌ది అయితే.. ప్రచారం కాంగ్రెస్‌ది అన్నట్లు ఉందని మాజీ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. కేసీఆర్‌ ఇచ్చిన ఉద్యోగాలకు రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇచ్చినట్టే.. కేసీఆర్ ప్రారంభించిన టిమ్స్‌ హాస్పిటల్స్‌ ప్రారంభోత్సవాల పేరుతో కాంగ్రెస్‌ ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. నేడు సనత్‌నగర్‌లోని టిమ్స్‌ హాస్పిటల్‌ ప్రారంభోత్సవంపై ఆయన స్పందించారు. డేట్లు, డెడ్‌లైన్లు మార్చుకుంటూ పోయి, చివరకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తున్న దవాఖానలో కూడా పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురాకపోవడం శోచనీయమన్నారు. వెయ్యి కోట్ల రూపాయలతో నిర్మించిన హాస్పిటల్‌ను కేవలం ఓపీ సేవలకే పరిమితం చేయడం సిగ్గుచేటన్నారుసీఎం రేవంత్‌ రెడ్డి పేరు మార్చినంత సులువుగా హాస్పిటల్‌ కట్టిన చరిత్ర మార్చలేవన్నారు. హైదరాబాద్‌కు...
⏱ Top Story 👁 7 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article