పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లి పాముకాటుతో రైతు మృతి
7tv focus : వారంలో అన్ని రోజులతో పాటు కనీసం ఆదివారం రోజైనా ఉచిత విద్యుత్ సక్రమంగా వస్తుందేమో.. ఎండిపోతున్న కంటిపాపలాంటి వరి చేనుకు నీళ్లు పారుతాయేమో అని ఆశపడ్డ ఆ రైతుకు కాంగ్రెస్ పాలన కన్నీళ్లే మిగిల్చింది. ప్రభుత్వం తెచ్చిన అస్తవ్యస్త విద్యుత్ కోతలు, నిర్లక్ష్య వైఖరి మునుగోడు మండలంలో ఒక నిండు ప్రాణాన్ని పొట్టనబెట్టుకున్నాయి. నల్గొండ జిల్లా మునుగోడు మండలం ఎల్లలగూడెం గ్రామానికి చెందిన రైతు తిరిపారి సత్యం (41) ఆదివారం మధ్యాహ్నం తన వరి పొలానికి వెళ్లాడు. వరి చేనును పరిశీలిస్తుండగా పాము కాటేసింది.గమనించిన కుటుంబ సభ్యులు దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. సత్యం మృతితో ఆయన భార్య, ఇద్దరు కుమారులు దిక్కులేని వారయ్యారు. కాగా, వేళాపాళా...
⏱ Top Story
👁 11 Views |
⬇️ 0 Downloads