పోగొట్టుకున్న ఫోన్ బాధితుడికి అందజేత
గుర్రంపోడు7tv focus : గుర్రంపోడు మండల కేంద్రానికి చెందిన వంగూరి సాయితేజ గత నెల మొదటి వారంలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను గుర్రంపోడు పోలీసులు చాకచక్యంగా వెతికి పట్టుకున్నారు. దేవరకొండలో లభ్యమైన ఈ ఫోన్‌ను గుర్రంపోడు ఎస్ఐ వెంకన్న బుధవారం పోలీస్ స్టేషన్‌లో బాధితుడికి అందజేశారు. పోలీసుల కథనం ప్రకారం.. వంగూరి సాయితేజ గత నెలలో మొబైల్ ఫోన్ ను పోగొట్టుకుని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్ఐ వెంకన్న పర్యవేక్షణలో పోలీసులు కేసు నమోదు చేశారు. మొబైల్ ట్రాకింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆ ఫోన్ ఎక్కడ ఉందో నిరంతరం పర్యవేక్షించారు. ఈ క్రమంలో సదరు మొబైల్ దేవరకొండలో ఉన్నట్లు సాంకేతిక ఆధారాల ద్వారా గుర్తించి, పోలీసులు...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads