పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న
మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ 7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూలై 1: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని చింతల్ సర్కిల్ గణేష్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ పోచమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం బుధవారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు కూన శ్రీశైలం గౌడ్‌ను శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ, మూడు రోజులపాటు నిర్వహిస్తున్న మహోత్సవాల్లో భాగంగా పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు....
⏱ Top Story
👁 20 Views |
⬇️ 0 Downloads