పోలీసుల గుప్పిట్లో హకీంపేట..
మహబూబ్‌నగర్ 7tv focus : మహబూబ్‌నగర్ జిల్లా దుద్యాల మండలం హకీంపేటలో నేడు జరగనున్న ప్రత్యేక గ్రామసభపై ఉత్కంఠ నెలకొంది. సర్వే నంబర్ 252లో భూములు, మల్టీపర్పస్ పార్కు భూపరిహారం పంపిణీపై వస్తున్న ఆరోపణలపై విచారణ కోరుతూ అఖిలపక్షం తీర్మానం చేయాలని నిర్ణయించడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. అయితే గ్రామసభకు ముందు గ్రామంలో భారీగా పోలీసులను మోహరించడం చర్చనీయాంశంగా మారింది.గ్రామసభ నేపథ్యంలో పోలీసులు పెద్ద సంఖ్యలో హకీంపేటకు చేరుకున్నారు. భూ వ్యవహారంలో బాధితులుగా ఉన్నవారిపై నిఘా కొనసాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గ్రామసభ ప్రశాంతంగా, స్వేచ్ఛగా జరుగుతుందని భావించిన తరుణంలో పోలీసు బందోబస్తు పెరగడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే గ్రామసభకు సర్పంచ్ రవీంద్ర చేరుకున్నారు. వంట మనిషి కూడా...
⏱ Top Story
👁 9 Views |
⬇️ 0 Downloads