పోల్‌ను ఢీకొన్న ఇండిగో విమానం
7tv focus : శ్రీనగర్ విమానాశ్రయంలో ఒక ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఆరో నంబరు బే పై విమానాన్ని పార్కింగ్ చేస్తుండగా అది ప్రమాదవశాత్తూ ఒక సాంకేతిక స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ విమానంలోని ప్రయాణికులకు, సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు. అయితే విమానం ముందు భాగం దెబ్బతిన్నట్లు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) తెలిపింది. ఆ విమానం ఈ ఉదయం ముంబయి నుంచి శ్రీనగర్‌కు ప్రయాణించినట్లు పేర్కొంది. ఈ ఘటన తర్వాత విమానం మాన్యువల్ మెట్లపై నుంచి ప్రయాణికులను విమానాశ్రయ సిబ్బంది సురక్షితంగా కిందకు దించారు. అనంతరం విమానాశ్రయంలో విమాన రాకపోకలను అనుమతించారు. ఈ ఘటనపై ఇంకా విచారణ జరుగుతోందని, ప్రమాద కారణాలను విశ్లేషిస్తున్నట్లు ఏఏఐ...
⏱ Top Story
👁 3 Views |
⬇️ 0 Downloads