ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి
7tv focus : తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఇరువురు నేతలు ఓ ప్రకటన విడుదల చేశారు. దీపావళి ప్రతి ఇంటా ఆనందాల వెలుగులు నింపాలి: సీఎం చంద్రబాబు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి జరుపుకుంటారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) పేర్కొన్నారు. ఈ పండుగ ప్రతి ఇంటా ఆనందాల వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, సిరిసంపదలు వెల్లివిరియాలని అభిలాషించారు.ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలు చిగురించాలని కోరుకున్నారు. మనం వెలిగించే దీపం మన ఇంటికే కాదని, సమాజానికీ వెలుగునివ్వాలని ఆకాంక్షించారు
⏱ Top Story
👁 6 Views |
⬇️ 0 Downloads