KCR-Deepavi_V_jpg--816x480-3g
7TV Focus News

 ప్రజల కష్టాలు తొలగి, సర్వ సంపదలు చేకూరాలి..రాష్ట్ర ప్రజలకు కేసీఆర్‌ దీపావళి శుభాకాంక్షలు

7tv focus : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అజ్ఞానపు చీకట్లను తొలగించుకుని జ్ఞాన కాంతులను ఆహ్వానించాలనే సందేశాన్ని దీపావళి పండుగ మనకందిస్తుందని అన్నారు.రాష్ట్ర ప్రజల కష్టాలు తొలగి, సర్వ సంపదలు చేకూరేలా, రాష్ట్రం తిరిగి ప్రగతి పథంలో పయనించేలా లక్ష్మీదేవి అమ్మవారు ప్రజలపై కరుణాకటాక్షాలు అందించాలని ప్రార్థించారు. బాణాసంచా కాల్చే సందర్భంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ కుటుంబ సభ్యులందరూ పండుగ సంబురాలు నిర్వహించుకోవాలని సూచించారు.
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article