ప్రజల వినతులు స్వీకరించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూన్ 30: ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు సామాజిక, పౌర సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను మంగళవారం ఆయన నివాసంలో అందజేశారు.ఈ సందర్భంగా ప్రతి వినతిని పరిశీలించిన కూన శ్రీశైలం గౌడ్, సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల ప రిష్కారమే తన లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తమ కుటుంబ శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను మాజీ ఎమ్మెల్యేకు అందజేసి, కార్యక్రమాలకు హాజరుకావాలని ఆహ్వానించారు....
⏱ Top Story
👁 26 Views |
⬇️ 0 Downloads