dm-rajyalaxmi_V_jpg--816x480-4g
7TV Focus News

‘ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర ఎంతో గొప్పది’

7tv focus :  ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర ఎంతో గొప్పదని, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ సమాజానికి పాత్రికేయులు అందిస్తున్న సేవలు అభినందనీయమని కొత్తగూడెం ఆర్టీసీ డిపో మేనేజర్ యు.రాజ్యలక్ష్మి అన్నారు. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా సోమ‌వారం కొత్తగూడెం బస్టాండ్ ఆవరణలో వనజీవి విశ్వామిత్ర చౌహాన్ ఆధ్వర్యంలో పాత్రికేయులతో కలిసి మొక్క నాటారు. ఈ సందర్భంగా డీఎం రాజ్యలక్ష్మి మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ప్రతిరోజూ మొక్కలు నాటుతున్న విశ్వామిత్ర చౌహాన్ కృషి అభినందనీయమని, పత్రికా దినోత్సవం సందర్భంగా బస్టాండ్‌లో మొక్క నాటడం ఆనందంగా ఉందన్నారు.అనంతరం వనజీవి విశ్వామిత్ర చౌహాన్ మాట్లాడుతూ వాక్ ఫర్ ట్రీస్ యజ్ఞంలో భాగంగా తన 1,628వ మొక్కను నాటినట్లు తెలిపాడు. మొక్కలు నాటుదాం.. పర్యావరణాన్ని కాపాడుదాం...
⏱ Top Story 👁 7 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article