ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూన్ 27: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ను ఆయన నివాస కార్యాలయంలో కలిసి వివిధ సమస్యలను వినిపించారు. వినతిపత్రాలను స్వీకరించిన ఎమ్మెల్యే, సంబంధిత అధికారులతో సమన్వయం చేసి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ఎల్పీ విప్ కేపీ వివేకానంద్‌ను శనివారం ఆయన నివాస కార్యాలయంలో వివిధ కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో కలిసి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ప్రజలను ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే, ఒక్కొక్కరి సమస్యను ఓర్పుగా ఆలకించారు. తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, విద్యుత్ తదితర స్థానిక సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను స్వీకరించి, వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులకు సమస్యలను వెంటనే...
⏱ Top Story
👁 49 Views |
⬇️ 0 Downloads