ప్రభుత్వ ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దని ఎమ్మెల్యే మందుల సామేల్‌కి వినతి
7tv focus : గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తుంగతుర్తి మండలం రావులపల్లి గ్రామానికి మంజూరైన 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని గొట్టిపర్తి గ్రామానికి మార్చొద్దని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలకు రావులపల్లి గ్రామ సర్పంచ్ చింతకుంట్ల మనోజ్ బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సర్వసభ సమావేశం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందాలనే సంకల్పంతో మంజూరు చేసిన 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని వేరే ప్రాంతానికి తరలించకుండా రావులపల్లిలోనే పక్కా ప్రభుత్వ భవనం నిర్మించాలని ఎమ్మెల్యేను కోరినట్లు ఆయన తెలిపారు.
⏱ Top Story
👁 6 Views |
⬇️ 0 Downloads