ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి జొన్నగిరి గోల్డ్ మైన్స్ సహకారం కోరిన విద్యాశాఖ
మౌలిక వసతులు, విద్యా వాలంటీర్ల ఏర్పాటుకు వినతిపత్రం తుగ్గలి, ఆగస్టు 3 (7టీవీ ఫోకస్ న్యూస్ ) తుగ్గలి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు అవసరమైన మౌలిక వసతులు, విద్యా వాలంటీర్ల నియామకానికి జొన్నగిరి గోల్డ్ మైన్స్ యాజమాన్యం సహకారం అందించాలని మండల విద్యాశాఖ అధికారులు కోరారు.సంస్థ సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా తుగ్గలిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు పగిడిరాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, ఫర్నిచర్, ఇతర మౌలిక వసతులు కల్పించడంతో పాటు విద్యార్థుల బోధనకు అవసరమైన విద్యా వాలంటీర్లను ఏర్పాటు చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.ఈ సందర్భంగా శారీరక విద్య ఉపాధ్యాయుడు చందు నాయక్,...
⏱ Top Story
👁 6 Views |
⬇️ 0 Downloads