DEAD-2_V_jpg--816x480-3g
7TV Focus News

ప్రమాదవశాత్తూ నీట మునిగి వ్యక్తి మృతి

 7tv focus : ప్రమాదవశాత్తూ నీట మునిగి ఓ వ్యక్తి మృతిచెందిన చెందిన సంఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని ఏడుపాయల చెక్ డ్యాంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం ..పాపన్నపేట గ్రామానికి చెందిన ఆకుల క్రిష్ణ(30) కూలీ పనులు చేస్తూ జీవితం గడుపుతున్నాడు. గురువారం రాత్రి ఏడుపాయల వద్ద ఉన్న తన తల్లి అంజమ్మ వద్దకు వెళ్లాడని, శుక్రవారం ఉదయం స్నానం చేసేందుకు ఏడుపాయల చెక్ డ్యాం వద్దకు వెళ్లి స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి గల్లంతయ్యాడని వివరించారు.
⏱ Top Story 👁 7 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article