ప్లే స్కూల్‌లో దారుణం.. 3 ఏళ్ల చిన్నారిని కుర్చీకి కట్టేసి.
7tv focus : ప్లే స్కూల్లో తన బిడ్డను కుర్చీకి కట్టేసి హింస పెట్టారంటూ ఓ మూడేళ్ల బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యూఢిల్లీలోని మోజ్‌పూర్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ ఘటనలో పోలీసులు ఇప్పటికే ప్లేస్కూల్‌లోని ఆయాను అరెస్టు చేశారు. స్కూల్లోని ఓ టీచర్, ప్రిన్స్‌పాల్, డైరెక్టర్‌పై కూడా కేసులు నమోదయ్యాయి.కొన్ని రోజుల క్రితం పిల్లాడి ప్రవర్తనలో మార్పులను గమనించిన తల్లిదండ్రులు చెక్ చేయగా అతడి ఒంటిపై గాయాలు కనిపించాయి. బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అతడిని ఎవరో కొట్టి ఉండవచ్చని వైద్యుడు సందేహం వ్యక్తం చేశారు. రెండు చెవుల లోపలి భాగాలు వాచాయని చెప్పారు. అంతకుముందు చాలా రోజుల పాటు తమ బిడ్డ బాత్రూమ్‌కు వెళ్లేందుకు కూడా భయపడేవాడని...
⏱ Top Story
👁 19 Views |
⬇️ 0 Downloads