ఫైనల్‌కు భారత మహిళా హాకీ జట్టు
7tv focus : జూనియర్ ఆసియా కప్‌లో భారత మహిళా హాకీ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీ ఫైనల్‌లో దక్షిణ కొరియాపై భారత్ 5-1 తేడాతో ఘన విజయం సాధించింది. గత మ్యాచ్‌లతో పోలిస్తే ఈసారి భారత అమ్మాయిలకు గట్టి పోటీనే ఎదురైంది. అయినప్పటికీ దక్షిణ కొరియాను భారీ తేడాతో చిత్తు చేసింది. కాగా ఈ టోర్నీలో ఇప్పటికే పురుషుల హాకీ జట్టు ఫైనల్ బెర్తు ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే. భారత విజయంలో సుప్రియ కీలక పాత్ర పోషించింది. ఆమె ఏకంగా హ్యాట్రిక్ సాధించి ప్రత్యర్థిని హడలెత్తించింది. సుప్రియ మూడు గోల్స్ చేయగా.. మధు సిదార్, సుఖ్వీర్ కౌర్ చెరో గోల్ సాధించారు. దక్షిణ కొరియా తరఫున యురి జెంగో ఒక్క...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads