బలమైన రాష్ట్రాలే.. మరింత బలమైన భారత్‌కి పునాది
చెన్నై7tv focus : ‘బలమైన రాష్ట్రాలే.. మరింత బలమైన భారతదేశానికి పునాది’ అని తమిళనాడు సీఎం విజయ్ అభివర్ణించారు. గురువారం తమిళనాడులోని మహాబలిపురంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాలకు చెందిన సీఎంలు హాజరయ్యారు. ఈ సందర్భంగా తమిళనాడు సీఎం విజయ్ మాట్లాడుతూ పలు కీలక అంశాలు లేవనెత్తారు. హకార సమాఖ్య విధానమే దేశ బలానికి పునాది అని వ్యాఖ్యానించారు. కేంద్రం - రాష్ట్రాలు, రాష్ట్రాల మధ్య విభేదాలను చర్చలు, పరస్పర గౌరవం, చట్టబద్ధ విధానాల ద్వారా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. డీలిమిటేషన్‌పై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనాభా నియంత్రణలో విజయం సాధించిన రాష్ట్రాల పార్లమెంట్ ప్రాతినిధ్యం...
⏱ Top Story
👁 7 Views |
⬇️ 0 Downloads