బహిరంగ చర్చకు సిద్ధం.. అరెస్టులతో అడ్డుకోవడం ఎందుకు?: బీఆర్ఎస్
7టీవీ ఫోకస్ (ప్రతినిధి), హైదరాబాద్, జూలై 2: రాష్ట్ర అప్పులు, విద్యాశాఖలో అవినీతిపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే చర్చకు ఆహ్వానించిన కాంగ్రెస్ మంత్రులు వెనక్కి తగ్గి పోలీసులతో అడ్డుకోవడం సరైంది కాదని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. తెలంగాణ భవన్‌లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర అప్పుల లెక్కలు వెల్లడించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, విద్యాశాఖలో జరిగినట్లు ఆరోపిస్తున్న అవినీతిపై కూడా బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ మంత్రులకు మరోసారి సవాల్ విసిరారు. చర్చకు రావాలని కోరుతూ పలువురు మంత్రులకు ఫోన్ చేసినప్పటికీ స్పందన రాలేదని వారు తెలిపారు. అవినీతి జరగకపోతే, అప్పుల లెక్కలు సక్రమంగానే ఉంటే బహిరంగ చర్చకు రావడానికి ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు....
⏱ Top Story
👁 226 Views |
⬇️ 0 Downloads