బాలాపూర్ ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం..
7tv focus : సోమవారం తెల్లవారు జామున రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌లోని రాయల్ కాలనీలో ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. వెంటనే స్థానికులు సమాచారమందించడంతో ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.ఇవాళ ఉదయం 3 గంటలకు ప్లాస్టిక్ గోదాంలో మంటలు చెలరేగుతున్నాయని మాకు ఫోన్ కాల్ వచ్చింది. హయత్ నగర్, చంద్రాయణ గుట్ట నుంచి రెండు అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.. దర్యాప్తు కొనసాగుతుందని అగ్నిమాపక శాఖ అధికారి ఒకరు తెలిపారు.
⏱ Top Story
👁 10 Views |
⬇️ 0 Downloads